తదుపరి వార్తా కథనం

Rain alert: ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయండి.. పోలీసుల సూచన
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 22, 2025
11:11 am
ఈ వార్తాకథనం ఏంటి
సైబరాబాద్ పరిధిలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సైబరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు మంగళవారం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వీలు కల్పించాలని కోరారు. దీనికి సంబంధించి కంపెనీలు సహకారం అందించాలనే అభ్యర్థనను సైబరాబాద్ పోలీసు శాఖ వెల్లడించింది. ఈ సమాచారం కోసం సైబరాబాద్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సైబరాబాద్ పోలీసుల ట్వీట్
🚨Alert 🚨 pic.twitter.com/BdwGyAdpOL
— Cyberabad Police (@cyberabadpolice) July 22, 2025