Loading...
Andhra Pradesh: తీరం వైపు దూసుకొస్తున్న అక్వాన్‌ తుపాను.. గంటకు 5 కి.మీ వేగంతో..
తీరం వైపు దూసుకొస్తున్న అక్వాన్‌ తుపాను.. గంటకు 5 కి.మీ వేగంతో..

Andhra Pradesh: తీరం వైపు దూసుకొస్తున్న అక్వాన్‌ తుపాను.. గంటకు 5 కి.మీ వేగంతో..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 'అక్వాన్‌' (Cyclone Akvan) తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నరసాపురం-పూరీ మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.

వివరాలు 

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళదు: ప్రఖర్‌ జైన్

తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది.

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆ శాఖ ఎండీ ప్రఖర్‌ జైన్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT