Page Loader
ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
తుపాను ప్రభావంతో. కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు

ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 17, 2023
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది. రానున్న 24 గంటల్లో తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. అయితే ఈ 24 గంటల్లో వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంద్రప్రదేశ్

తూఫాన్ ప్రభావంతో. కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ నెల 16 నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఇవాళ్టి నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో. కోస్తాంధ్ర, రాయలసీమల్లో నాలుగు రోజులపాటు అంటే 20,21 తేదీల వరకు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తరుగా, అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే చర్యలకు సిద్దమవుతుంది.