బిపార్‌జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు
బిపార్‌జాయ్ తుపాను గుజరాత్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను గురువారం రాత్రి తీరాన్ని తాకి, శుక్రవారం కుంభవృష్టిని కురిపిస్తోంది. తుపాను ధాటికి వీసుస్తున్న బలమైన గాలులతో చెట్లు విరిగి పడి తండ్రీకొడుకులు చనిపోయారు. మరో 22మంది గాయపడ్డారు. అయితే తుపాను తీరాన్ని దాటేందుకు దాదాపు 6గంటల వరకు సమయం పట్టొచ్చని ఐఎండీ చెబుతోంది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో గుజరాత్‌లోని దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని రాష్ట్ర అధికారులు తెలిపారు.
జామ్‌నగర్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందం మోహరింపు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారీ వర్షాలు, ఈదురు గాలుల మధ్య అనేక చెట్లు నేలకూలాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరగింది. ఈక్రమంలో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాన్ని మోహరించారు. వరదల మధ్య గుజరాత్‌లోని మాండ్విలో ఇళ్లు, ఆసుపత్రి నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయినట్లు అధికారులు వెల్లడించారు. బిపార్జోయ్ తుపాను శుక్రవారం మధ్యాహ్నం సమయానికి 'తీవ్రమైన' తుపాను నుంచి తుపానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుపాను నేపథ్యంలో 82,000 మందిని పాకిస్థాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాజస్థాన్‌లోని బార్మర్‌లో రెడ్ అలర్ట్
బిపార్జోయ్ తుపాను రాజస్థాన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నందున, బార్మర్ జిల్లాలోని ధోరిమన్న పట్టణంలో ఈదురు గాలులకు స్తంభాలు, చెట్లను నేలకూల్చాయి. బార్మర్ జిల్లాలో ఉదయం 11 గంటల తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ రైల్వేలో తుపాను పీడిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పూర్తిగా రద్దు చేయబడిన లేదా రీ షెడ్యూల్ చేసిన రైళ్ల జాబితాను పశ్చిమ రైల్వే శుక్రవారం విడుదల చేసింది.