Page Loader
దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు

దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు

వ్రాసిన వారు Stalin
May 17, 2023
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే రాబోయే ఐదు రోజుల పాటు ఒడిశాలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, దిల్లీ, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లో ఈదురు గాలుల ప్రభావం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇదే సమయంలో దిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున, జాతీయ రాజధాని నివాసితులు ఎండలనుంచి కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. మధ్యప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది.

ఒడిశా

ఒడిశాలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ 

ఒడిశాలో రానున్న ఐదు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఢిల్లీ అంతటా మంగళవారం ఉదయం బలమైన గాలులు వీచాయి. దుమ్ము, గాలి నాణ్యతను ప్రభావితం చేసింది. అలాగే దృశ్యమానత 1,000 మీటర్లకు తగ్గిందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని 18చోట్ల మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐఎండీ తన అంచనాలో పేర్కొంది. బాలాసోర్, భద్రక్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పూర్, జాజ్‌పూర్, కటక్, ఖుర్దా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.