AP Rains: నేడు బంగాళాఖాతంలో వాయుగుండం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈవ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ,సోమవారం వరకూ ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలోని దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అనంతరం వచ్చే 48గంటల్లో ఇది తుపానుగా మరింత బలపడే అవకాశముందని సంస్థ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం,శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడవచ్చని కూడా తెలిపింది. అలాగే,సోమవారం ప్రకాశం,శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు,వైఎస్సార్ కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రాంతాలవారీగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. రైతులు తమ పంటల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారలు హెచ్చరించారు.