Montha Cyclone: విరుచుకుపడ్డ మొంథా తుపాను.. అస్తవ్యస్తమవుతున్న ప్రకాశం జిల్లా
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ (Montha Cyclone) ప్రభావం ప్రకాశం జిల్లాపై తీవ్రమైన విధంగా కొనసాగుతోంది. నిన్న చిరుజల్లులతో తుపాన్ ప్రభావం మొదలవగా, ఈ రోజు మేఘావృత వాతావరణం, చీకట్లు, భారీ వర్షాలతో జిల్లా మొత్తం తుపాన్ తాకిడిని ఎదుర్కొంటోంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచడంతో పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. శింగరాయకొండ ప్రాంతంలో ఓ భారీ చెట్టు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సముద్రతీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రమైంది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్ వద్ద తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Details
ప్రత్యేకాధికారి నియామకం
సాధారణంగా కార్తీక మాసంలో భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడే కొత్తపట్నం బీచ్ ఈసారి తుపాన్ కారణంగా నిర్మానుష్యంగా మారింది. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు పూర్తి అప్రమత్తతలో ఉన్నారు. సముద్రతీర గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించి, ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారి (Special Officer)ను నియమించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రమాదం ఉన్న 17 గ్రామాల ప్రజలను అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా చీరాల నుంచి పాకాల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. చీరాలలోని చేనేత మగ్గాలు కూడా నీటిలో మునిగిపోయాయి.
Details
తన
రబీ సీజన్‌లో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాత్రి మరింత భారీ వర్షాలు పడే అవకాశముండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.