LOADING...
AP Cyclone : ఏపీకి సెనియార్ తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఏపీకి సెనియార్ తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

AP Cyclone : ఏపీకి సెనియార్ తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంథా తుపాన్ ఏపీలో విపరీత విధ్వంసం సృష్టించిన తర్వాత, ఇప్పుడు సెనియార్ తుఫాన్ రాష్ట్ర వైపుకు దూసుకుపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజల పాలిటకు కొత్తగా పీడగా మారనుంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో బలమైన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ, తదుపరి 48 గంటల్లో, అంటే 26వ తేదీ నాటికి తుఫాన్‌గా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Details

భారీ వర్షాలు కురిసే అవకాశం

26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత తుఫానం ఎటు వైపు కదులుతుందో, ఏ ప్రాంతాల్లోకి ప్రభావం ఉండదో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మొంథా తుపాను ఏపీలో తీరం దాటిన తర్వాత వారం రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Details

ఆందోళనలో రైతులు

ఆ ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు సాగు చేసిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పంటకు మూడ్‌లో ఉన్నప్పుడు మరో తుఫాను దూసుకువస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.