LOADING...
AP Rain : ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

AP Rain : ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రానికి తుపాను ప్రమాదం తప్పింది. మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడి బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపానుకు 'సెనియార్' అనే పేరు పెట్టారు. అయితే మరో 24 గంటల్లో ఈ తుపాను క్రమంగా బలహీనపడుతుందని, బంగాళాఖాతానికే పరిమితమై అక్కడే శక్తిని కోల్పోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

తుపాను ఇండోనేషియా భూభాగాన్ని దాటనున్నట్లు అంచనా

భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, మలక్కా జలసంధి, దాని పక్కన ఉన్న ఈశాన్య ఇండోనేషియా ప్రాంతాల సమీపంలోనే సెనియార్ తుపాను కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో సుమారు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలిన మలక్కా జలసంధి తీవ్ర అల్పపీడనం చివరకు సెనియార్ తుపానుగా మారింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ తుపాను ఇండోనేషియా భూభాగాన్ని దాటనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో, భారత్‌కు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ తుపాను నుంచి ఎలాంటి ముప్పు లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.