Cyclone Alert: ఏపీ వైపు తుపాను ముప్పు.. చెన్నై, విశాఖకు ఎంత దూరంలో ఉందంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 15, 2026
01:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుపాను ముందస్తు హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి 840 కి.మీ, విశాఖపట్నానికి 1,010 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఏపీ తీరం వైపు కదిలే అవకాశం వాయుగుండం మరింత బలపడి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఇది తుపానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అనంతరం ఏపీ తీరప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.