Loading...
Andhra Pradesh Cyclone Alert: ఏపీకి తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతులు, జాలర్లకు హెచ్చరికలు!
ఏపీకి తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతులు, జాలర్లకు హెచ్చరికలు!

Andhra Pradesh Cyclone Alert: ఏపీకి తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతులు, జాలర్లకు హెచ్చరికలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సాయంత్రానికి ఇది తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫారసులను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చిన అర్నబ్‌ తరహాలోనే ఈ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వివరించారు. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు సహా పలు జిల్లాలపై ప్రభావం ఉండొచ్చని తెలిపారు.

వివరాలు

రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్నాయుడు

తుపాను నేపథ్యంలో రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

తుపాను ప్రభావంతో పంటలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 23.87 లక్షల హెక్టార్ల పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

'16 జిల్లాల్లోని 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలపై పర్యవేక్షణ ఉంటుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

ఇప్పటికే 30,635 బోట్లు సురక్షితంగా తీరం చేరాయి. ఉద్యాన పంటలకు నష్టం జరిగితే వారంలోగా పూర్తి వివరాలు అందించాలని అచ్చెన్నాయుడు తెలిపారు.

ADVERTISEMENT