
Dalai Lama: దలైలామా శాంతికి, కరుణకు ప్రతీక.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ''దలైలామా శాంతికి, ప్రేమకు, కరుణకు, నైతిక క్రమశిక్షణకు రూపం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని 140 కోట్ల భారతీయులతో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చే సందేశం మతాలకు అతీతంగా ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సందర్భంగా స్పందించారు. 'ఆధ్యాత్మిక గురువు దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన శాంతి, సమైక్యత, కరుణ పాఠాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
Details
శాంతి కోసం నిరంతరం కట్టుబడి ఉంటాను
90వ జన్మదిన సందర్భంగా దలైలామా మాట్లాడుతూ మానవతా విలువల పరిరక్షణ, మత శాంతి కోసం నేను నిరంతరం కట్టుబడి ఉంటాను. టిబెట్ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్రశాంతత, కరుణను అందించగలదని నమ్ముతానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తన వారసుడి ఎంపికపై దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 90 ఏళ్లు నిండటంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నదని, దానిని నిర్వహించే అధికారం కేవలం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కే ఉందని స్పష్టం చేశారు.
Details
దలైలామాకు భారత్ మద్దతు
2011 సెప్టెంబర్ 24న టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై సలహాలు తీసుకున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలే లభించాయని చెప్పారు. ఈ ప్రకటనపై చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆమోదం లేకుండా దలైలామా ఎంపిక అంగీకరించబోదని చెప్పింది. మరోవైపు భారత్ మాత్రం దలైలామాకు తమ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ పరిణామాలతో, వారసత్వ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.