
Sawai Madhopur: రాజస్థాన్ లో భారీ వర్షాలు.. సర్వాల్ జలాశయంకు వరద నీరు పోటెత్తడంతో.. 55 అడుగుల లోతుకు కుంగిపోయిన భూమి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సర్వాల్ జలాశయం పొంగి పొర్లింది. నీటి ఒత్తిడి కారణంగా సుమారు 2కిలోమీటర్ల పొడవు,100అడుగుల వెడల్పు, 55అడుగుల లోతు భారీ గొయ్యి ఏర్పడింది. ఈఘటన సువాయ్ మాధోపూర్ జిల్లాలోని జదవత ప్రాంతంలోని గ్రామంలో చోటు చేసుకుంది. ఈసంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత మూడు రోజులుగా సవాయి మాధోపూర్‌లో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి,దాంతో గ్రామస్థుల జీవనం స్తంభించిన స్థాయికి చేరింది. సర్వాల్ జలాశయం ఓవర్ ఫ్లో కారణంగా వరద ఉధృతి జాదవత గ్రామంలోని పొలాల్లో 55 అడుగుల లోతు కలిగిన గొయ్యి ఏర్పడింది.
వివరాలు
భారీ గొయ్యిని పూడ్చడం కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం
పొలంలోని చెట్లు, స్థానికంగా ఉన్న పలు ఇళ్లు భారీ గుంతలోకి వెళ్లిపోయాయి. ఈ కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.గొయ్యి మరింత విస్తరిస్తే, గ్రామంలోని ఇళ్లకు నష్టం కలగవచ్చనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా, ఆ ప్రాంతాల్లో రాకపోకలు కూడా ఆగిపోయాయి. సంఘటన స్థలానికి మంత్రి డాక్టర్ కిరోడి లాల్ మీనా, కలెక్టర్, ఎస్పీ, ఎస్డీఎం, తహసీల్దార్, విపత్తు నిర్వహణ బృందాలు చేరి సహాయక చర్యలను ప్రారంభించాయి. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కొనసాగుతోంది. భారీ గొయ్యిని పూడ్చడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. అయినప్పటికీ, స్థానికులు సహాయక చర్యల్లో వేగం పెంచాలని కోరుతున్నారు. లేకపోతే, గ్రామంలోని ఇళ్లు ఆ భారీ గవ్వలోకి కూరుకుపోవచ్చు అనే భయం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
55 అడుగుల లోతుకు కుంగిపోయిన భూమి.. వీడియో వైరల్
#WATCH | Rajasthan: A big portion of land caves in due to heavy rainfall in Sawai Madhopur. pic.twitter.com/fUzz8GTdht
— ANI (@ANI) August 24, 2025