LOADING...
Danam Nagender: కాంగ్రెస్ లోకి దానం నాగేందర్... సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ
కాంగ్రెస్ లోకి దానం నాగేందర్... సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ

Danam Nagender: కాంగ్రెస్ లోకి దానం నాగేందర్... సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 15, 2024
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)నుండి ఫిరాయింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశమయ్యారు. ఎమ్యెల్యే దానం నాగేందర్ శుక్రవారం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో అయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.... దానం కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. అయితే ఎల్లుండి అంటే 18వ తారీఖు పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఈ నెల 18న కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే దానం నాగేందర్