Page Loader
Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..
ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..

Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో నిలబడేందుకు కూడా స్థలం దొరక్క, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ అప్రమత్తమై, ప్రయాణికుల సౌకర్యం కోసం పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని, ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

వివరాలు 

170 ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి వివిధ ముఖ్యమైన మార్గాల్లో నడవనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 170 ప్రత్యేక రైళ్లు నడపగా, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లు నడవనున్నాయి. అదనంగా మరో 185 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు ప్రకటించారు. ప్రధాన రూట్లు సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నగర్ సోల్, సికింద్రాబాద్-మడ్లాటౌన్, హైదరాబాద్-గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-సంత్రాగచ్చి, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-షిర్డీ, నాందేడ్-ఈరోడ్, జాల్నా-చాప్రా వంటి రూట్లలో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.