
BRS: బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి యంగ్ లీడర్ రాజినామా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో షాక్ తగిలింది.
ఇటీవల తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా,గురువారం యంగ్ లీడర్ దాస్యం అభినవ్ భాస్కర్ పార్టీకి రాజీనామా చేశారు.
త్వరలోనే బీజేపీ పార్టీలో చేరనున్నట్లు భాస్కర్ ప్రకటించారు.పార్టీ లో తగిన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీ కి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
దింతో వరంగల్ వెస్ట్ లో రాజకీయం మరింత వేడెక్కబోతోంది. తనకు విలువ లేనిచోట ఉండలేనన్నారు.
పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కార్పొరేటర్ గా గెలిచిన భాస్కర్ ఈసారి ఏకంగా తనకు ఎమ్యెల్యే టికెట్ కావాలని పట్టుపట్టిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దాస్యం అభినవ్ భాస్కర్ చేసిన ట్వీట్
నేను బి.ఆర్.ఎస్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశాను…
— Dr. Dasyam Abhinav Bhaskar (@dasyam_abhinav) February 7, 2024
రాజీనామ లేఖను పార్టీకి ఈమెయిల్ ద్వారా పంపడం జరిగింది…
త్వరలోనే ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది…@BRSparty @KTRBRS pic.twitter.com/NiSIrL9EMl