Page Loader
చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 
చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం

చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 

వ్రాసిన వారు Stalin
Sep 19, 2023
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతావనికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంట్ భవనానికి తుది వీడ్కోలు పలికిన రోజు.. కొంగొత్త ఆశలతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలుపాలనే దృఢ సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనంలోకి ఎంపీలు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, రాజకీయ ప్రముఖులు అడుగుపెట్టిన రోజు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల రెండోరోజు సెషన్ ప్రారంభానికి ముందు కొత్త భవనాన్నిఅధికారికంగా భారత్ పార్లమెంట్‍‌గా నోటిఫై చేస్తూ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండోరోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంపీలు, రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్, స్పీకర్ ఓం బిర్లా పాత పార్లమెంట్ భవనంలో ఫొటో సెషన్ నిర్వహించి తుది వీడ్కోలు పలికారు.

మోదీ

కొత్త పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌లో ప్రముఖల ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్, స్పీకర్ ఓం బిర్లా నాయకత్వంలో ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. సెంట్రల్ హాల్‌లో సీనియర్ పార్లమెంటేరియన్లు ప్రసంగించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగత ప్రసంగం చేస్తారు. లోక్‌సభలో సీనియర్ సభ్యురాలు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మొదటి స్పీకర్‌గా ఉంటారని పీటీఐ వర్గాలు తెలిపాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ప్రసంగించాలని కేంద్రం ఆహ్వానం పంపింది. కానీ ఆయన అనారోగ్యం కారణంగా హాజరు కాకపోవచ్చునని తెలుస్తోంది. రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా మాట్లాడనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేనకా గాంధీ ప్రసంగం

మోదీ

పార్లమెంట్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ 

పార్లమెంట్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ నేటి నుంచి అమల్లోకి రానుంది. మార్షల్స్, భద్రతా సిబ్బంది, అధికారులు, ఛాంబర్ అటెండర్లు, డ్రైవర్లకు కొత్త యూనిఫాంలను అందజేశారు. దిల్లీ నడిబొడ్డున కర్తవ్య మార్గంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు అంతస్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు.