LOADING...
Atchannaidu: మొంథా తుపాను పంటనష్టం నమోదు గడువు పొడిగింపు: అచ్చెన్నాయుడు
మొంథా తుపాను పంటనష్టం నమోదు గడువు పొడిగింపు: అచ్చెన్నాయుడు

Atchannaidu: మొంథా తుపాను పంటనష్టం నమోదు గడువు పొడిగింపు: అచ్చెన్నాయుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్ ప్రభావంతో రైతులకు జరిగిన పంటనష్టాల నమోదు కోసం ఇవ్వబడిన గడువును మరో రెండు రోజుల పాటు పెంచినట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు.

వివరాలు 

ఈ-క్రాప్‌ నమోదు జరగలేదంటూ జగన్ రెడ్డి నిరాధార, అసత్య ఆరోపణలు

"రాష్ట్రవ్యాప్తంగా ఈ-క్రాప్‌ నమోదు ఇప్పటికే 100 శాతం పూర్తయింది. తుపాను వల్ల నష్టం జరిగిన ప్రతి రైతుకు ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుంది. అయితే, ఈ-క్రాప్‌ నమోదు జరగలేదంటూ జగన్ రెడ్డి నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కోరిన ప్రాంతానికైనా నేను స్వయంగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడే ఈ-క్రాప్‌ నమోదు పూర్తయ్యిందో లేదో సాక్ష్యాలతో చూపిస్తాను" అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.