Priyanka: మెడికో ప్రియాంక మృతి.. కిమ్స్ వైద్యుల ధ్రువీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
రాజమహేంద్రవరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందారు. ప్రమాదం తర్వాత చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ప్రియాంక మృతిని ధ్రువీకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్ నుంచి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుష్యంత్, ఆండ్రూ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ.. ప్రియాంక, ఆమె స్నేహితుడు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు.
వివరాలు
వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు
ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతిచెందారు.