Page Loader
Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 16మంది కార్మికులు మృతి

Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 

వ్రాసిన వారు Stalin
Aug 01, 2023
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్ సమీపంలో గిర్డర్ మెషిన్ కుప్పకూలడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే మూడో దశ నిర్మాణంలో ఉందని షాపూర్ పోలీసులు తెలిపారు. వంతెన నిర్మాణంలో గిర్డర్ మెషిన్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు. కార్మికులు పనిలో నిమగ్నమైన సమయంలో గిర్డర్ యంత్రం 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. మరికొంత మంది ఇప్పటికి గిర్డర్ యంత్రం కింద ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారిని గాయపడిన షాపూర్ తాలూకాలోని ఆసుపత్రిలో చేర్పించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సహాయక చర్యల దృశ్యాలు

మహారాష్ట్ర

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

మృతి చెందిన వారిలో ఐదుగురు సైట్ ఇంజనీర్లు, 11మంది కార్మికులు, మరో ఇద్దరు బయటి వ్యక్తులుగా అధికారులు చెబుతున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం షాహాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు కార్మికులు యంత్రం కింద చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ ట్వీట్