Page Loader
AAP office space allotment: ఆప్ ఆఫీసుకి స్ధలాన్ని కేటాయించండి.. కేంద్రానికి 6 వారాలు గడువు
ఆప్ ఆఫీసుకి స్ధలాన్ని కేటాయించండి.. కేంద్రానికి 6 వారాలు గడువు

AAP office space allotment: ఆప్ ఆఫీసుకి స్ధలాన్ని కేటాయించండి.. కేంద్రానికి 6 వారాలు గడువు

వ్రాసిన వారు Stalin
Jun 05, 2024
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆప్ కు దేశరాజధానిలో ఎక్కడో ఒక చోట పార్టీ ఆఫీసుకి అనువైన స్ధలాన్ని కేటాయించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో ఈ మేరకు సమాధానం ఇవ్వాలని కేంద్రానికి గడువు విధించింది. అన్ని జాతీయ పార్టీలకు ఇచ్చిన విధంగా ఆ పార్టీకి కేటాయించాలని కోరింది. జనరల్ పూల్ లో స్ధలం లేదన్న సాకుతో ఇవ్వకపోవడం సరికాదంది కోర్టు. సాధారణ కేటాయింపుల్లో భాగంగా ఆప్ కు ఇవ్వాలని సూచించింది.

Details 

గత ఏడాది రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసిన ఆప్ 

ఆప్ గత ఏడాది రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. భూమి ఇచ్చే వరకు జాతీయ పార్టీకి తాత్కాలిక కార్యాలయానికి అర్హత ఉందని న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డిడియు) మార్గ్‌లోని పార్టీ మంత్రి నివాసపు బంగ్లాను తాత్కాలిక కార్యాలయంగా వినియోగిస్తున్నామని కోర్టుకు చెప్పారు .

Details 

రాజకీయ పార్టీలకు ప్రత్యేక కోటా లేదన్న కేంద్రం 

కాగా కేటాయింపు జనరల్ పూల్ నుండి రావాలని , రాజకీయ పార్టీలకు ప్రత్యేకమైన జాబితా లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వివరించారు. AAP తన కార్యాలయాల అవసరాల కోసం 2014లో భూమిని అందించిందని, అయితే దానిని అంగీకరించలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం పూల్ నుండి ఒక గృహ యూనిట్‌ను కేటాయించడం సాధ్యం కాదన్నారు . తిరస్కరణకు చెప్పిన కారణం సరైనది కాదు..జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ జనరల్ పూల్‌లో ఇల్లు లేకపోవడం జాతీయ పార్టీ అభ్యర్థనను తిరస్కరించడానికి కారణం కాదని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అన్నారు.