
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.
పట్టణాలు, పురపాలిక ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలు ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు.
అయితే, తమ దరఖాస్తు స్థితి ఏదీ అనే విషయంలో అనేక మంది అనిశ్చితిలో ఉండి, పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ సమస్యను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో లబ్ధిదారులు తమ దరఖాస్తు స్థితి తెలుసుకునే అవకాశం పొందుతారు.
వివరాలు
వెబ్‌సైట్ ఉపయోగించే విధానం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం https://indirammaindlu.telangana.gov.in/applicantsearch అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. గూగుల్‌లో వెబ్‌సైట్‌ను సెర్చ్ చేసి, ఓపెన్ చేయాలి.
ఆధార్ సంఖ్యను నమోదు చేయడం ద్వారా దరఖాస్తు స్థితి తెలుస్తుంది.
మొబైల్ నంబర్ నమోదు చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది.
అనంతరం, పేరు, చిరునామా, ఇతర వివరాలను నమోదు చేయాలి.
ఫిర్యాదుల కేటగిరీ డ్యాష్‌బోర్డులో కనిపిస్తుంది, దాన్ని ఎంచుకోవాలి.
ఎదుర్కొంటున్న సమస్యను వివరించి, ఫిర్యాదు వివరాలను ప్రత్యేక బాక్స్‌లో నమోదు చేయాలి.
అవసరమైన స్థలం లేదా ఇతర ధ్రువపత్రాలను 2MB పరిమాణం లో PDF, PNG, JPG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
చివరగా, ఫిర్యాదు నంబర్ వస్తుంది. దీనిని భద్రంగా ఉంచుకుంటే, ఫిర్యాదు స్థితి తెలుసుకోవచ్చు.