Chennamma: దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం.. చెన్నమ్మ మృతిపై చంద్రబాబు, లోకేశ్ సంతాపం!
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి చెన్నమ్మ శనివారం కన్నుమూశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఆమె తల్లి. చెన్నమ్మ మృతివార్తతో రాజకీయ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు దేవెగౌడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. చెన్నమ్మ మరణవార్త తెలుసుకుని ఎంతో బాధపడ్డాను. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకి, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను.
వివరాలు
నారా లోకేష్ సంతాపం
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా చెన్నమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.చెన్నమ్మ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు.