26 రఫేల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. రక్షణశాఖ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ఫ్రాన్స్ పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరారు.ఈ సందర్భంగా ఫ్రెంచ్ దేశంతో పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
ఇందుకు అనుగుణంగా 26 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు డీఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 రఫేల్ ఎం మోడల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములను కొనుగోలు చేయనున్నట్లు రక్షణశాఖ పేర్కొంది.
ఈ మేరకు రక్షణశాఖ పంపిన ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదం లభించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, ఫ్రెంచ్ దేశంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
ఫలితంగా 22 సింగిల్ సీటర్ రఫేల్ మెరైన్ విమానాలు, 4 రెండు సీట్ల శిక్షణ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అందనున్నాయి.
DETAILS
రూ.90 వేల కోట్ల ఖర్చుతో భారీ రక్షణ డీల్
దాదాపు రూ.90 వేల కోట్ల ఖర్చుతో ఈ డీల్ జరగనుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఒప్పందం పూర్తైన తర్వాతే పూర్తి స్థాయి విలువ బహిర్గతం కానుంది.
మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ కంపెనీ, భారత్‌కు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేసే అంశంపైనా ఒప్పందం జరగనుంది.
వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై మోహరించనున్నారు.
ఇప్పటికే వాయుసేన కోసం భారత్ 36 రఫేల్ జెట్‌లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. ఫ్రెంచ్ దేశ సహకారంతో భారత్‌లో ఇప్పటికే ఆరు స్కార్పీన్ జలాంతర్గాములు భారత అమ్ములపొదిలో దాగి ఉంది.
తాజాగా ఫ్రాన్స్ ఒప్పందంతో రక్షణ రంగంలో భారత్ మరింత బలోపేతం కానుంది.