ఫ్రాన్స్‌కు బయల్దేరిన మోదీ.. రఫేల్ సహా కీలక ఒప్పందాలకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. జులై 14న జరగనున్న బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ ప్రజల జాతీయ దినోత్సవానికి అతిథిగా హాజుకానున్నారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఫ్రాన్స్ పర్యటన ప్రారంభించారు. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొననుండటం సంతోషంగా ఉందని గురువారం ఉదయం దిల్లీ నుంచి బయలుదేరే ముందు ప్రధాని ట్వీట్ చేశారు.
మరోవైపు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ పరేడ్‌కు మోదీని అహ్వానించడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ ఏడాదితో భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సం జరుపుకోనుంది.ఈ క్రమంలోనే మోదీ ఫ్రాన్స్ పర్యటన మైలురాయిగా నిలువనుంది.
DETAILS
ఫ్రెంచ్ పర్యటనలో 2009లో మన్మోహన్ సింగ్, 2023లో నరేంద్ర మోదీ
సాధారణంగా బాస్టిల్ డే పరేడ్ వేడుకలకు విదేశీ నేతలకు ఆహ్వానం అందించరు. 2017లో బాస్టిల్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని మాత్రమే ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రస్తుతం భారతదేశం తరఫున మోదీని ఆహ్వానించారు.
అయితే బాస్టిల్ డే వేడుకలకు 2009లో ముఖ్య అతిథిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. బాస్టిల్ డే వేడుకలకు భారత దేశాధినేతలను ఆహ్వానించడం, ఇరుదేశాల సంబంధాల దృఢత్వాన్ని తెలియజేస్తున్నట్లు దౌత్యవేత్తలు భావిస్తున్నారు.
మరోవైపు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో కీలక ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు దేశాధినేతలు చర్చించనున్నారు.
DETAILS
రక్షణ రంగంలో మరికొన్ని కీలక ఒప్పందాలను గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం
భారత నౌకా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఈ పర్యటన ద్వారా కీలక ప్రకటన వచ్చే అవకాశముంది.
విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసమే ఈ యుద్ధ విమానాలను కొనుగోలుకు యత్నిస్తున్నారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపుగా రూ. 90 వేల కోట్లకుపైగా ఉంటుందని రక్షణ వర్గాల అంచనా.
వీటికి అదనంగా రక్షణ రంగంలో మరిన్ని డిఫెన్స్ అగ్రిమెంట్స్ లకు రెండు దేశాలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాల్లో భాగంగానే సాంకేతిక మార్పిడి అంశాలు సైతం ఉన్నాయి.
స్కార్పీన్ జలాంతర్గాముల కోసం మళ్లీ ఆర్డర్స్ ఇవ్వాలని భారత్‌ను ఫ్రాన్స్ అడుగుతోంది. భారత్-ఫ్రాన్స్ ఇప్పటివరకు 35 కంటే ఎక్కువ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై సంతకాలు చేయడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్రాన్స్ బయలుదేరే ముందు ప్రధాని ట్వీట్
Furthering friendship with France!
— PMO India (@PMOIndia) July 13, 2023
PM @narendramodi emplanes for Paris. A wide range of programmes including talks with President Macron, a community programme and meeting with CEOs will be a part of this visit. pic.twitter.com/PcZzVVIDTT