Page Loader
 PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ 
ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ

 PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల కోసం వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడి అనంతరం భద్రతా వ్యవహారాలపై కేంద్ర క్యాబినెట్ కమిటీ (CCS) అత్యవసర భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో ఉగ్రవాదులపై తక్షణ చర్యలకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కల్పించారు. లక్ష్యాలను ఎప్పుడు ఎలా దాడి చేయాలన్నదానిపై తామే నిర్ణయం తీసుకోవచ్చని సీసీఎస్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో,సైనిక సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధవిమానాల ల్యాండింగ్‌,టేకాఫ్ విన్యాసాలు నిర్వహించడంతో స్పందన స్పష్టమైంది.

వివరాలు 

రక్షణశాఖ కార్యదర్శి భేటీకి మరింత ప్రాధాన్యత

ఆ తరువాత భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, వాయుసేన చీఫ్‌ అమర్‌ప్రీత్ సింగ్‌లు వరుసగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ పరిణామాల మధ్య రక్షణశాఖ కార్యదర్శి భేటీకి వచ్చారు,ఇది మరింత ప్రాధాన్యతను పొందింది. ఇదిలా ఉండగా, భారత్ ఇప్పటివరకు పహల్గాం దాడికి ప్రత్యక్షంగా సైనిక ప్రతిస్పందన ఇవ్వకపోయినా, పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా ఒత్తిడికి గురిచేస్తోంది. ఇప్పటికే సింధు జలాలపై ఒప్పందాన్ని పాటించకుండానే భారత్‌ వాటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ పాకిస్తాన్‌ను కఠిన పరిస్థితిలోకి నెట్టింది. తాజాగా బగలిహార్‌ జలాశయం నుండి నీటి సరఫరాను నిలిపివేయడం వల్ల పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో సాగునీరు అందక చాలా ప్రదేశాలు దెబ్బతిన్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇది స్పష్టమైంది.

వివరాలు 

కిషన్‌గంగ జలాశయం నుండి కూడా నీరు వెళ్లకుండా యోచన 

జీలం నదిపై ఉన్న కిషన్‌గంగ జలాశయం నుండి కూడా నీటిని పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకునే దిశగా కేంద్రం యోచిస్తోంది. అంతేకాకుండా కశ్మీర్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించడంతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.