Page Loader
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ 

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గురువారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సాధారణ పరీక్షల్లో భాగంగా ఉదయం శాంపిల్స్‌ను పరీక్షించగా పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ గురువారం దిల్లీలో జరిగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా పరీక్షల తర్వాతే ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల బృందం అతడిని పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హోమ్ క్వారంటైన్‌లో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌