Page Loader
భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 
భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం

భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ సైబర్ అటాక్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది. భారత రక్షణ సిబ్బందిని పాకిస్థాన్ సైబర్ అటాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ అడ్వైజరీలో పేర్కొంది. .IN డొమైన్ కింద రిజిస్టర్ చేయబడిన వెబ్‌సైట్‌లను ఉపయోగించి పాకిస్థాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని కేంద్రం వెల్లడించింది. .IN డొమైన్ అనేది భారతదేశానికి సంబంధించిన కోడ్ అని, దీన్ని పాక్ సైబర్‌ అటాకర్లు ఉపయోగించడం వల్ల దాడి మూలాన్ని గుర్తించడం కష్టమవుతోందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ .IN డొమైన్‌ను ఉపయోగించడం అనే కొత్త వ్యూహం అని, ప్రస్తుతం ఇది సైబర్ నేరగాళ్ల ట్రెండ్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సైబర్

పాక్ నిర్వహిస్తున్న డొమైన్‌లను గుర్తించేందుకు ప్రత్యేక ఆపరేషన్

భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సెక్యూరిటీ అడ్వైజరీలో పలు అనుమానిత వెబ్‌సైట్‌లను పొందుపర్చింది. అనుమానిత సైట్లలో coorddesk.in, ksboards.in, coordbranch.in, ksbpanel.in ఉన్నాయి. సాయుధ దళాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సైబర్ దాడులకు ఉపయోగిస్తున్న మరిన్ని డొమైన్‌లను గుర్తించడానికి కేంద్రం ఆపరేషన్‌ను చేపట్టింది. భారత రక్షణ సిబ్బంది సైబర్ దాడుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ఎందకంటే, రక్షణ సిబ్బంది నుంచి సమాచారం లీకైతే, అది జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మాల్వేర్ నుంచి అప్రమత్తంగా ఉండాలని భారతీయ రక్షణ సిబ్బందిని హెచ్చరించింది. అనుమానిత వెబ్‌సైట్‌ల యూఆర్ఎల్‌లను బ్లాక్ చేయడం, అటువంటి వెబ్‌సైట్‌లకు సంబంధించి సిబ్బందిందరికీ అవగాహన కల్పించాలని అడ్వైజరీలో పేర్కొంది.