Page Loader
Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక  
గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక

Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారింది. మధ్యాహ్నం వేళలోనే ఆకాశం మేఘావృతమైంది. దీనితో పాటు బలమైన గాలులు వీయబోతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గాలుల ప్రభావంతో శుక్రవారం రోజున విమానాల రాకపోకల్లో తాత్కాలిక ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందని స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా నాలుగు గంటల వరకు విమానాల ఆలస్యాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌తో సమంతరంగా సమాచారాన్ని పంచుకుంటూ ఉండాలని విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

చాలామంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే..

విమానాశ్రయ నిర్వహణ సంస్థ తమ ఎక్స్ (ట్విట్టర్)అకౌంట్లో ఓ ప్రకటన చేస్తూ,ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వారిభద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఏర్పడిన ధూళి తుఫానుల వల్ల వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాంతో చాలామంది ప్రయాణికులు విమానాశ్రయంలో గంటల తరబడి ఇరుక్కుపోయారు. కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్సయ్యే పరిస్థితులు నెలకొనడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అయితే, కొన్ని గంటల తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పుడిగానీ,మళ్లీ గాలుల ఉధృతి కారణంగా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావచ్చన్న అనుమానంతో,ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ విమానాశ్రయం ట్వీట్