LOADING...
Delhi blast: దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ 
దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్

Delhi blast: దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఏడు కు చేరింది. షోయబ్ ఉమర్‌కు పది రోజులపాటు తన ఇంట్లో ఆశ్రయమివ్వడమే కాకుండా, ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడికి ముందు పేలుడు పదార్థాలను కూడా సరఫరా చేసినట్టు తెలిపారు.

వివరాలు 

డా.ముజమ్మిల్ షకీల్ సమాచారంతో షోయబ్‌ అరెస్టు 

పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులలో ఒకరు డా.ముజమ్మిల్ షకీల్ ఇచ్చిన సమాచారంతో షోయబ్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. అలాగే, షోయబ్ అల్-ఫలా విశ్వవిద్యాలయంలో కాంపౌండర్‌గా పనిచేశాడు అని,ఉగ్ర కుట్రల గురించి అతనికి ముందే తెలుసు అని అధికారులు తెలిపారు. ఐఈడీ బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను నిందితులు అతని ఇంట్లోనే నిల్వ చేసినట్లు గుర్తించామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్