LOADING...
Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం
Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం

Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 23, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ ఉలిక్కిపడింది. కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి వెల్‌కమ్‌ జనతా మజ్దూర్‌ కాలనీలోని ఈద్గా రోడ్డులో చోటు చేసుకుంది. ఉత్తర దిల్లీలో వెల్‌కమ్‌ ప్రాంతంలో ఓ బాలుడు దారిన వెళ్తున్న యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేసి ఊపిరాడనీయలేదు. సదరు యువకుడు స్పృహ కోల్పోయిన తర్వాత తన వద్ద ఉన్న కత్తితో ఘోరంగా 60 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అనంతరం మృతుడి వద్ద నుంచి రూ.350 నగదును స్వాధీనం చేసుకున్నాడు.

Details

ఎటువంటి పరిచయం లేదు, డబ్బు కోసమే హత్య : పోలీసులు

ఈ క్రమంలోనే కొద్దిసేపు మృతదేహం ఎదుట డాన్స్‌ చేస్తూ క్రూరంగా ప్రవర్తించాడు. ఈ దారుణం దృశ్యాలు సమీపంలోని ఓ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదరు బాధితుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేవలం డబ్బు కోసమే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.