తదుపరి వార్తా కథనం

Arvind Kejriwal: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన .. తొలి ఆదేశం జారీ
వ్రాసిన వారు
Stalin
Mar 24, 2024
09:52 am
ఈ వార్తాకథనం ఏంటి
లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
ఈ మేరకు ఈడీ కస్టడీ నుంచి దిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన తొలి ఉత్తర్వును ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేశారు.
సీఎం కేజ్రీవాల్ ఒక నోట్ ద్వారా జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఆప్ నేత, మంత్రి అతిషి ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి, సీఎం కేజ్రీవాల్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జైలు నుంచి తోలి ఆదేశం జారీ చేసిన కేజ్రీవాల్
#BreakingNews: CM Arvind Kejriwal issues first order related to water portfolio while being In ED custody.@rupashreenanda with details | @anjalipandey06 #AAP #ED #ArvindKejriwal pic.twitter.com/z7nYLc5Vlh
— News18 (@CNNnews18) March 24, 2024