Delhi: ఆప్ కార్యకర్తలపై రమేష్ బిధూరి మేనల్లుడు దాడి.. ఈసీకి ముఖ్యమంత్రి అతిషి ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Election 2025) తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను భయపెట్టడమే కాకుండా, దాడులు కూడా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఈ మేరకు ఆమె ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ప్రధానంగా, బీజేపీ ఎంపీ రమేష్ బిధురి మేనల్లుడు తమ పార్టీ కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడని, ఈ విషయాన్ని ఆమె ఈసీకి ఫిర్యాదు చేశారు.
వివరాలు
"ఇంట్లో కూర్చోకపోతే.. కాళ్లు చేతులు విరిచేస్తాం!"
ఢిల్లీ సీఎం అతిషి.. ఈసీకి ఫిర్యాదు చేసిన దాని ప్రకారం, "బీజేపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలకు ఈ ఎన్నికలలో ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చేయవద్దని, వస్తే కాళ్లు చేతుల్ని విరిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు."
ఫిబ్రవరి 5న ఎన్నికలు, ఫలితాలు 8వ తేదీకి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5వ తేదీన జరుగనున్నాయి, 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి.
ఈ ఎన్నికల్లో ఆప్ మరింత ప్రయత్నించి విజయం సాధించాలని చూస్తుంది.
అయితే, బీజేపీ కూడా కట్టుదిట్టంగా పోటీకి సిద్ధమైంది. ఈ ఎన్నికల సందర్భంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
వివరాలు
కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు: "ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి"
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ,ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
తాజాగా,ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
పర్వేష్ వర్మ,ఢిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారని పర్వేష్ వర్మ ఆరోపించారు.
ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసిన పర్వేష్ వర్మ,ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను ఉల్లంఘించడాన్ని ఆరోపించారు.
పర్వేష్ వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ ద్వారా ఫిర్యాదు చేయించారు.ఈ ఫిర్యాదులో,ఆప్ నేతలు స్థానిక ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.