Page Loader
Delhi: 10ఏళ్ల బాలికను చిత్రహింసలు పెట్టిన దంపతులకు దేహశుద్ధి
10ఏళ్ల బాలికను చిత్రహింసలు పెట్టిన దంపతులకు దేహశుద్ధి

Delhi: 10ఏళ్ల బాలికను చిత్రహింసలు పెట్టిన దంపతులకు దేహశుద్ధి

వ్రాసిన వారు Stalin
Jul 19, 2023
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ద్వారకలో ఒక మహిళా పైలట్, ఆమె భర్తను మహిళలు దేహశుద్ధి చేశారు. 10ఏళ్ల బాలికను ఇంటిలో పనిగా పెట్టుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆ చిన్నారి బంధువులు దంపతులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా పైలట్, ఆమె భర్తపై బాల కార్మిక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9గంటల సమయంలో ఇంటి పనిమనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు ద్వారకా పోలీస్ స్టేషన్‌ సిబ్బంది తెలిపారు. వైద్య పరీక్షలో బాలిక శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లండిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళా పైలెట్ దంపతులను చితకబాదుతున్న దృశ్యం