Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీని పొడిగించిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. అయితే మనీలాండరింగ్ కేసులో తదుపరి విచారణ కోసం కేజ్రీవాల్ కస్టడీని ఏడు రోజుల పాటు పొడిగించాలని ఈడీ అధికారులు కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు.ఆప్ ని "అణిచివేసేందుకు" దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోందని అన్నారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు: ఈడీ
"ఈడీ రిమాండ్ పిటిషన్‌ను నేను వ్యతిరేకించడం లేదు. ఈడీ నన్ను ఎన్ని రోజులైనా కస్టడీలో ఉంచుకోవచ్చు. కానీ ఇది కుంభకోణం" అని ఢిల్లీ సిఎం అన్నారు.దర్యాప్తు సంస్థ "ట్రాప్" చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. మరోవైపు, కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌లను వెల్లడించలేదని కోర్టుకు తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు లంచం అడిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది.