
Kavitha: కవితకు మరోసారి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మంగళవారం మే 14వరకు పొడిగించారు.
తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తికావడంతో సీబీఐ,ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కోర్టులో కవితను హాజరుపరిచారు.
విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కీలక దశలో ఉందని,వారం రోజుల్లో కవితపై చార్జిషీటు దాఖలు చేయవచ్చని కోర్టుకు తెలిపింది.
60 రోజుల్లోగా విధిగా ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. బలమైన కారణాలుంటే.. అదనంగా మరో నెల ఛార్జ్‌షీటు దాఖలు చేసేందుకు సమయం పొడిగించవచ్చు.మొత్తం కలిపి 90 రోజుల్లోగా ఛార్జ్‌షీటు దాఖలు చేయకపోతే.. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు అవుతుంది.
Details
మీడియాతో కవిత కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు మంగళవారం హాజరైన కవిత.. బంధువుల్ని కలిసేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో కోర్టు సెల్‌లో ముగ్గురు బంధువులతో కలిసి భోజనం చేసేందుకు ప్రత్సేక న్యాయస్థానం అనుమతించింది.
ఇదిలా ఉంటే కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ మీడియాతో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను దేశం దాటించి.. తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారని వాపోయారు. ఇది అన్యాయం.. దీన్ని అందరూ గమనించాలని కవిత కోరారు.
అంతకుముందు ఏప్రిల్ 8న కోర్టు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. విచారణ సందర్భంగా ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత మహిళ అయినందున బెయిల్ మంజూరులో ఎలాంటి రాయితీ ఇవ్వలేమన్నారు.