ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం
ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ కూటమికి ఇండియా పేరు పెట్టడంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిది. విపక్షాల నేతలు ఇటీవలే ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ దిల్లీకి చెందిన గిరీశ్ భరద్వాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలిచ్చింది. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఎకతాటిపై పోటీ చేసేందుకు నిర్ణయించాయి.ఈ మేరకు కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ అంటూ ఇండియా పేరు పెట్టుకున్నాయి. జాతీయ చిహ్నంలో ఇండియా పేరు భాగమని, రాజకీయాల కోసం దాన్ని వినియోగించుకోవడం పట్ల పిటిషనర్ కోర్టుకెక్కారు. దీంతో 26 విపక్షాలకు నోటీసులు జారీ అయ్యాయి.