బ్రిజ్ భూషణ్ దేశం వదిలి వెళ్లకూడదు..లైగింక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఊరట లభించింది. దిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అతడితో పాటు డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ సింగ్ కు కూడా న్యాయస్థానం బెయిలిచ్చింది. అయితే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని వారికి స్పష్టం చేసింది.
ఈ కేసును పూర్తి స్థాయిలో పరిశీలించడానికి తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది. గురువారం విచారణ నిమిత్తం బ్రిజ్ భూషణ్ కోర్టుకు హాజరయ్యారు.
అయితే 25వేల వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
Details
జులై 28న తదుపరి విచారణ
విచారణ సందర్భంగా దిల్లీ పోలీసుల తరుపున న్యాయవాది ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. బ్రిజ్ భూషణ్ పిటిషన్ ను తాము వ్యతిరేకించడం లేదని, అలాగని అతనికి మద్దతు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
అయితే బ్రిజ్ భూషణ్ రైజర్లను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ వినేశ్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ దిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బ్రిజ్ భూషణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, బ్రిజ్‌భూషణ్ బెదిరించారని చెప్పేందుకు ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లకు ఎన్నిసార్లు చెప్పినా వారు ఇవ్వలేదని దిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.