Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ ఫిర్యాదు.. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 16న హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ 8 సమన్లు పంపిన తర్వాత కూడా ఢిల్లీ సీఎం విచారణ కోసం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే కేజ్రీవాల్‌పై ఈడీ ఇప్పటికే కోర్టులో ఫిర్యాదు చేసింది. వాస్తవానికి, ఐదవ సమన్ల తర్వాత,ED ఒక ఫిర్యాదును దాఖలు చేసింది. దీనిపై విచారణ అనంతరం ఫిబ్రవరి 7 న, కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17 న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
మార్చి 12 తర్వాత తేదీ కావాలని కోరిన కేజ్రీవాల్
అయితే బడ్జెట్ సెషన్ కారణంగా మరుసటి తేదీన హాజరవుతారని అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఈడీ ఎనిమిదవ సమన్లకు సమాధానమిస్తూ, ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని చెప్పారు. అయినప్పటికీ నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మార్చి 12 తర్వాత తేదీ కావాలని ఆయన కోరారు. దీనితో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏజెన్సీ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు. అదే సమయంలో, ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులు ఇస్తే మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరవుతానని కూడా చెప్పారు.