Page Loader
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తున్న మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు సోమవారం రెండు వారాల పాటు పొడిగించింది. సిసోడియాను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. ఏజెన్సీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ, కోర్టు సిసోడియాను ఏప్రిల్ 17వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. గతవారం, ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక సిబిఐ కోర్టు కొట్టివేసింది.

సీబీఐ

మద్యం కుంభకోణంలో కేసులో సిసోడియా కీలక పాత్ర: సీబీఐ

దిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో సిసోడియా కీలక పాత్ర పోషించాడని సీబీఐ అభియోగాలు మోపింది. అడ్వాన్స్ కిక్‌బ్యాక్ చెల్లింపుల ద్వారా సిసోడియాతో పాటు ఆయన అనుచరులు రూ.90కోట్లు- 100కోట్ల లబ్ధి పొందారని సీబీఐ ఆరోపిస్తోంది. స్కామ్‌తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీని 2021-22లో రూపొందించారు. దీని రూపకల్పన, అమలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సిసోడియాను సీబీఐ అనేక రౌండ్లు విచారించిన తర్వాత ఫిబ్రవరి 26న కస్టడీలోకి తీసుకుంది.