LOADING...
Delhi High Court: 24 గంటల్లో లింక్‌లు తొలగించాలి: సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు 
సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు

Delhi High Court: 24 గంటల్లో లింక్‌లు తొలగించాలి: సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హెరిటేజ్‌ సంస్థపై ప్రచురించిన ఆధారరహిత,అసత్య ఆరోపణలతో కూడిన వార్తలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు బోలెబాబా డెయిరీతో సంబంధం ఉందని పేర్కొంటూ సాక్షి మీడియా పలు కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో,హెరిటేజ్‌ సంస్థ యాజమాన్యం తమ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని పేర్కొంటూ రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం,సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా,ప్రసారం చేసిన అన్ని వార్తల లింక్‌లను 24గంటల లోపు తొలగించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను పాటించకపోతే,సంబంధిత లింక్‌ల తొలగింపునకు మెటా,గూగుల్‌,యూట్యూబ్‌ వంటి డిజిటల్‌ వేదికలు తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హెరిటేజ్‌పై అసత్య వార్తలు తొలగించాలని కోర్టు ఆదేశం

Advertisement