Arvind Kejriwal : కేజ్రీవాల్ సీఎంగా ఉండకూడదనే రాజ్యాంగపరమైన బాధ్యత ఏదీ లేదు: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. అరవింద్ కేజ్రీవాల్ తన పదవిలో కొనసాగకూడదనే రాజ్యాంగ బాధ్యత లేదని పేర్కొంది. ఇది ఎగ్జిక్యూటివ్‌కు సంబంధించిన అంశమని హైకోర్టు పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విషయాన్ని పరిశీలించి రాష్ట్రపతికి పంపుతారు. ఈ విషయంలో కోర్టు పాత్ర లేదు. ఈ వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది.