LOADING...
MLC Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌  చేసిన ఢిల్లీ హైకోర్టు 
MLC Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన ఢిల్లీ హైకోర్టు

MLC Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌  చేసిన ఢిల్లీ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2024
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మహిళ అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వివరించాయి. ఈ నెల 30 లేదా 31న తీర్పు వెలువడే అవకాశం ఉంది. కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 15న, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఏప్రిల్ 11న అరెస్టు చేసి, ఈడీ నమోదు చేసిన సమాంతర కేసులో జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులో ఉంచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ