
Massive Jam : నాలుగు రోజులుగా ఢిల్లీ-కోల్‌కతా హైవే భారీగా ట్రాఫిక్ జామ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన దిల్లీ-కోల్‌కతా హైవేపై (Delhi-Kolkata Highway) ప్రయాణం నరకంగా మారింది. బీహార్‌లోని ఔరంగాబాద్-రోహ్‌తాస్ మధ్యన జరిగిన ఈ దుస్థితిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత నాలుగు రోజులుగా భారీ ట్రక్కులు సహా అనేక వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ఈ సమస్యకు కారణం బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలు. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 19 (NH 19)పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. దాంతో డైవర్షన్లు, సర్వీస్ రోడ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది, వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
Details
ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం
వందలాది వాహనాలు బంపర్-టు-బంపర్ ఆగిపోయాయి. దీనికి అదనంగా అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం, పట్టించుకోకపోవడం ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఫలితంగా రోహ్‌తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రక్కు డ్రైవర్లు, సాధారణ ప్రయాణికులు నాలుగు రోజులుగా తిండి, నీళ్లు లేక రోడ్లపై నరకయాతనను అనుభవిస్తున్నారు. కొంత దూరం ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతుంది. వాహనదారులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు, "ఆహారం, నీళ్లు లేవు, పరిస్థితి చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ సమస్య వ్యాపారాలకు కూడా దెబ్బతీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.