Page Loader
దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్‌ను మెక్సికోలో అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు

దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్

వ్రాసిన వారు Stalin
Apr 04, 2023
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ మెక్సికోలో అరెస్టు చేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం తెలిపారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సహా ఉత్తర అమెరికా దేశానికి చెందిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సహా దిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లోని ఇద్దరు సభ్యుల బృందం దీపక్ బాక్సర్‌‌ను అరెస్టు చేసింది. అతడిని పట్టుకునేందుకు గత రెండు రోజులుగా అక్కడే మకాం వేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు పేర్కొన్నారు.

దిల్లీ

దీపక్ బాక్సర్‌పై రూ.3లక్షల రివార్డు

కనీసం ఐదు ప్రత్యేక సెల్ స్లీత్‌లను కలిగి ఉన్న మరో బృందాన్ని మెక్సికోకు పంపించి, చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసి బాక్సర్‌ను కస్టడీకి తీసుకొని, తద్వారా అతన్ని దిల్లీకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అకా గోగి ముఠాకు నేతృత్వం వహిస్తున్న దీపక్ బాక్సర్ దిల్లీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడిపై రూ. 3లక్షల రివార్డు కూడా ఉంది. కొన్ని వారాల క్రితం, దీపక్ బాక్సర్ నకిలీ పాస్‌పోర్ట్‌పై భారతదేశం నుంచి పారిపోయాడని మాకు ప్రామాణికమైన సమాచారం వచ్చిందని, అతను మెక్సికోకు వెళ్లి అక్కడే ఉంటున్నాడని ఖచ్చితమైన సమాచారంతోనే అక్కడికి వెళ్లినట్లు ప్రత్యేక సెల్ అధికారి ఒకరు చెప్పారు.