దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం జలమయమైనట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) సూచించింది. యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, రాజౌండ్, అసంద్, సఫిడాన్, గోహనా, రోహ్తక్, మహేందర్‌గఢ్, రేవారీ, నార్నాల్, కోస్లీ, బవాల్ (హర్యానా) సహరాన్‌పూర్, గంగోహ్, దేవబంద్, నజీబాబాద్, షామ్లీ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు.
తొమ్మిది విమానాల దారి మళ్లింపు
ముజఫర్‌నగర్, కాండ్లా, బిజ్నౌర్, ఖతౌలీ, సకోటి తండా, చాంద్‌పూర్, దౌరాలా, మీరట్, కిథోర్ (యూపీ) సిధ్‌ముఖ్, కోట్‌పుట్లీ (రాజస్థాన్)లో రాగల కొద్ది గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందని ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ తెలిపింది. అంతకుముందు గురువారం, దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బుధవారం దిల్లీ నుంచి జైపూర్ విమానాశ్రయానికి వెళ్లే తొమ్మిది విమానాలను దారి మళ్లించారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి