LOADING...
Delhi police: ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మృతికి కారణమైన BMW కారు డ్రైవర్‌ అరెస్టు 
ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మృతికి కారణమైన BMW కారు డ్రైవర్‌ అరెస్టు

Delhi police: ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మృతికి కారణమైన BMW కారు డ్రైవర్‌ అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో జరిగిన బీఎండ‌బ్ల్యూ కారు హిట్ అండ్ రన్ ఘటనలో, ఈ రోజు ఆ కారు డ్రైవర్ గగన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్, వారి భార్య సందీప్ కౌర్ బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు, బీఎండ‌బ్ల్యూ కారు వారిని ఢీ కొట్టింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో, డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ ప్రాణాలు కోల్పోగా, అయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఇదే ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ బీఎండ‌బ్ల్యూ డ్రైవ‌ర్ గ‌గ‌న్‌ప్రీత్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందింది. ఆమెను ఇవాళ పోలీసులు అరెస్టు చేసి క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

వివరాలు 

 బీఎండ‌బ్ల్యూ కారును డ్రైవ్ చేసిన మహిళ 

ఢిల్లీలోని పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. నిర్ల‌క్ష్య‌పూరిత డ్రైవింగ్ కింద‌ సెక్ష‌న్ 281, ప్ర‌మాద‌భ‌రిత ప్ర‌వ‌ర్త‌న కింద 125 బీ ,హ‌త్యాయ‌త్నం కింద 105 సెక్ష‌న్‌, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన కేసులో 238 సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అలాగే, ప్రమాదంలో నష్టం కలిగిన వాహనాన్ని ఎఫ్ఎస్ఎల్ బృందం తనిఖీ చేసింది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం, బీఎండ‌బ్ల్యూ కారును ఒక మహిళ డ్రైవ్ చేసింది. సెంట్రల్ వర్జ్ వద్ద బైక్‌ను ఢీకొన్న తర్వాత కారు కంట్రోల్ తప్పిపోయింది. ఆ సమయంలో బైక్‌ను ఢీ కొట్టింది. సాక్ష్యులు పేర్కొన్నట్లుగా, బీఎండ‌బ్ల్యూ లో లెదర్ సీట్లు,కవర్లు, బెల్టులు తయారీలో ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది.

వివరాలు 

ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి 19కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రి

ఆర్థిక‌శాఖ ఎక‌నామిక్ అఫైర్స్‌లో డిప్యూటీ సెక్ర‌ట‌రీగా చేస్తున్న న‌వ‌జ్యోత్ సింగ్‌..హ‌రిన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు. బీఎండ‌బ్ల్యూ డ్రైవ‌ర్ గ‌గ‌న్‌ప్రీత్ వ‌య‌సు 38ఏళ్లు. ఆమె భ‌ర్త ప‌రీక్షిత్ మ‌క్క‌డ్ వ‌య‌సు 40ఏళ్లు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌ను ఢీకొన్న వెంటనే,నవజ్యోత్ సింగ్,సందీప్ కౌర్‌లను వెంటనే ఒక వ్యాన్‌లో ఆసుపత్రికి తరలించారు. వారిని జీటీబీ నగర్‌లోని న్యూ లైఫ్ ఆసుపత్రికి చేర్చారు.ఆసుపత్రి,ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి 19కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన కొన్ని అంశాల త‌ర్వాత , ఆ ఆసుపత్రి,బీఎండ‌బ్ల్యూ డ్రైవర్ గగన్‌ప్రీత్‌కు నేరుగా సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి పరిస్థితులపై, 19కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్ళాల్సిన అవసరం ఏంటన్న విషయంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.