Loading...
Rahul Gandhi: దిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
దిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!

Rahul Gandhi: దిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
06:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో బుధవారం కూడా రాజకీయ ఉద్రిక్తత కొనసాగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు నిరసనకు దిగారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముందుగా దిల్లీలోని జనపథ్‌లో ఉన్న సాగర్ రత్న రెస్టారెంట్‌లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. లంచ్ అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని విపక్ష ఎంపీలు నిర్ణయించారు.

వివరాలు 

బస్సుల్లో జంతర్ మంతర్‌కు ఇండియా కూటమి నేతలు

అనంతరం ఇండియా కూటమి నేతలు బస్సుల్లో జంతర్ మంతర్‌కు బయలుదేరారు.

అయితే నిరసన ప్రదేశానికి చేరుకోకముందే పోలీసులు బస్సులను అడ్డుకున్నారు.

జంతర్ మంతర్ వద్ద భైఠాయించి ఆందోళన కొనసాగించేందుకు విపక్ష నేతలు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

రాహుల్ గాంధీని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, ఆయన అక్కడే నిరసన కొనసాగించారు.

మరోవైపు ప్రియాంకా గాంధీ రోడ్డుపై కూర్చుని, అనంతరం పడుకుని నిరసన వ్యక్తం చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు.

వారిని బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు.

వివరాలు 

వరుసగా రెండో రోజు కూడా రాజకీయ ఉద్రిక్తత

ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

దిల్లీ పోలీసులు తమపై లాఠీలతో దాడి చేశారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు.

మరోవైపు ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాహుల్ గాంధీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల కమిషన్, ఓటర్ల జాబితా సవరణ అంశంపై విపక్షాల నిరసనల నేపథ్యంలో దిల్లీలో వరుసగా రెండో రోజు కూడా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్, ప్రియాంక అరెస్టు

ADVERTISEMENT