LOADING...
Delhi Red Fort Blast 2025: చాట్‌జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్‌ఐఏ
చాట్‌జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్‌ఐఏ

Delhi Red Fort Blast 2025: చాట్‌జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్‌ఐఏ

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ రెడ్‌ఫోర్ట్ ప్రాంతంలో గత ఏడాది నవంబర్‌ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలున్న అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌ తాత్కాలిక మాడ్యూల్‌కు చెందిన నిందితులు చాట్‌జీపీటీ, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను దుర్వినియోగం చేసి "టెర్రర్ ఇంజినీరింగ్"కు పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ మే 14న ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో 7,500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ పేలుడులో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

వివరాలు 

చాట్‌జీపీటీలో రాకెట్ బాంబుల తయారీపై సెర్చ్‌లు

ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రకారం.. నిందితుడు జసీర్ బిలాల్ వాని ఉగ్ర మాడ్యూల్‌కు "ఇన్‌హౌస్ ఇంజినీర్"గా వ్యవహరించాడు. రాకెట్ ఆధారిత ఐఈడీల తయారీపై యూట్యూబ్, చాట్‌జీపీటీలో సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. "రాకెట్ ఎలా తయారు చేయాలి.. మిశ్రమం ఏ నిష్పత్తిలో ఉండాలి" వంటి అంశాలపై ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

అడవుల్లో రాకెట్ ఐఈడీల పరీక్షలు

డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్‌లతో కలిసి జసీర్ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా ఖాజిగుండ్ అడవుల్లో రాకెట్ ఐఈడీలను తయారు చేసి పరీక్షించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అక్కడి నుంచి పేలుడు పరికరాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పేలుడు కారుకు డ్రైవర్‌గా ఉమర్ ఉన్ నబీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీ పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నడిపినట్లు ఎన్‌ఐఏ ఆరోపించింది. ఐఈడీల తయారీలో జసీర్‌కు మార్గనిర్దేశం చేశాడని తెలిపింది. మరో నిందితుడు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ చక్కెర పొడి,ఎన్‌పీకే ఎరువుల రూపంలో పొటాషియం నైట్రేట్ వంటి పదార్థాలను సరఫరా చేసినట్లు పేర్కొంది.

Advertisement

వివరాలు 

డ్రోన్లను ఆయుధాలుగా మార్చే ప్రయత్నాలు

దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. నిందితులు డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు కూడా ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. డాక్టర్ ఉమర్ జసీర్‌కు రెండు డ్రోన్లు ఇచ్చి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించినట్లు ఆరోపించింది. కశ్మీర్‌తో పాటు దేశంలోని భద్రతా స్థావరాలపై దాడులకు వీటిని వినియోగించే యత్నం జరిగినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఆన్‌లైన్‌లో పేలుడు సామగ్రి కొనుగోళ్లు జసీర్ ఫ్లిప్‌కార్ట్ ఖాతా ద్వారా 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి మధ్య ట్రిగ్గర్ మెకానిజంలకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ప్రాక్సిమిటీ స్విచ్‌లు, రిలే ట్రాన్స్‌మిటర్లు, సోల్డరింగ్ కిట్లు, ఎలక్ట్రానిక్ భాగాలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. వీటికి సంబంధించిన చెల్లింపులు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఉమర్ నిర్వహించినట్లు వెల్లడించింది.

Advertisement

వివరాలు 

టీఏటీపీ పేలుడు పదార్థంతో దాడి

రెడ్‌ఫోర్ట్ సమీపంలో జరిగిన వాహన బాంబు పేలుడులో ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) అనే అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. పలు ప్రయోగాల తర్వాత ఈ పేలుడు పదార్థాన్ని రహస్యంగా తయారు చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

Advertisement