Page Loader
Delhi Air pollution: ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయుకాలుష్యం.. 165గా నమోదైన ఏక్యూఐ లెవల్స్‌ 
ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయుకాలుష్యం.. 165గా నమోదైన ఏక్యూఐ లెవల్స్‌

Delhi Air pollution: ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయుకాలుష్యం.. 165గా నమోదైన ఏక్యూఐ లెవల్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2024
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో గాలి కాలుష్యం కాస్త మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) డేటా ప్రకారం,గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (Air Quality Index) 165గా నమోదు అయ్యింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన ఏక్యూఐ ప్రకారం,ఆనంద్‌ విహార్‌లో 178,ఛాందినీ చౌక్‌ వద్ద 194, ఐటీవో ప్రాంతంలో 130, వాజీపూర్‌లో 152, ఓఖ్లా ఫేజ్‌-2 వద్ద 147, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 145, పట్పర్గంజ్‌లో 164, ఆయా నగర్‌లో 107, లోధి రోడ్డులో 128, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 3 వద్ద 162, పంజాబీ భాగ్‌లో 152గా గాలి నాణ్యత నమోదు అయింది.

వివరాలు 

 పూర్‌ కేటగిరీలో కొన్ని ప్రాంతాలు 

అయితే కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్‌ కేటగిరీలో ఉంది. ఆర్కేపురంలో 204, ముంద్కాలో 222, షాదీపూర్‌లో 249, నెహ్రూ నగర్‌లో 247, జహన్‌గిర్‌పురిలో 206గా ఏక్యూఐ నమోదు అయింది. గాలి నాణ్యత సూచిక ప్రకారం, 0-50 మధ్యలో ఉంటే బాగా ఉన్నట్టుగా పరిగణిస్తారు. 51-100 మధ్య సంతృప్తికరమైనదిగా, 101-200 మధ్య మితమైన నాణ్యతగా, 201-300 మధ్య తక్కువ నాణ్యతగా, 301-400 మధ్య చాలా పేలవమైనదిగా, 401-500 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా భావిస్తారు.